వికారాబాద్ జిల్లాలో పలు గ్రామాలలో గత వారం రోజులుగా చాలీచాలని మిషన్ భగీరథ నీరు రావడంతో గ్రామాలలో నీటి ఎద్దడి మొదలైంది. ద్విచక్ర వాహనాలపై ఆటోలలో ట్రాక్టర్లలో పొలాల నుండి నీటిని ఇంటికి తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా దారులు మండల పరిధిలోని మున్నూరు సోమవారం గ్రామంలో నీటి కష్టాలు తీర్చాలని మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోవడంతోని త్రాగునీటి కష్టం ఏర్పడిందని వెంటనే అధికారులు త్రాగునీటి సమస్యను తీర్చాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.