ప్రైవేట్ బ్యాంకుల వేధింపులు అరికట్టాలని, కాల్ మనీ వేధింపులకు గురిచేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమజిల్లా లో వివిధ ప్రైవేట్ బ్యాంకులు అమాయకులకు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ వాయిదాలు చెల్లించకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.