ఇండోర్ పర్యటనలో నేర్చుకున్న అభివృద్ధి విధానాలను ఖమ్మంలో అమలు చేస్తాం అని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు.ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు ఇండోర్ స్టడీ టూర్ పై విలేకరుల సమావేశాన్ని ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ ఉపమేయర్ ఫాతిమా జోహార నిర్వహించారు.