కురుమద్దాలిలో ఆక్వా పరిశ్రమలను సందర్శించి వ్యర్థజల శుద్దీకరణ ప్లాంట్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాలాజీ శుక్రవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్తానిక పామర్రు మండలం కురుమద్దాలి గ్రామంలోని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సామ్ ఆక్వా పరిశ్రమలను సందర్శించి వ్యర్థజల శుద్దీకరణ ప్లాంట్ లను పరిశీలించారు. ఆయా పరిశ్రమలలో రొయ్యల ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు వినియోగించిన నీటిని తిరిగి సాంకేతిక పరిజ్ఞానంతో శుద్దీకరణ చేసే ప్రక్రియను పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను వారి నుండి అడిగి తెలుసుకున్నారు.