మియాపూర్ డివిజన్ పరిధిలో పెద్ద కుడి చెరువు సుందరీకరణ సంరక్షణ అభివృద్ధి పనులలో భాగంగా ఒక కోటి 93 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చెరువులో మురుగునీరు కలవకుండా చేపడుతున్న మురుగునీటి మళ్లింపు కాలువ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ శనివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు సుందరీ కరణ అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.