మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండా లో ఈ రోజు మంగళవారం ఉదయం మేత కోసం వెళ్ళిన రెండు ఆవులు, నీరు తాగేందుకు వ్యవసాయ బావివద్దకు వెల్లిన క్రమంలో రెండు ఆవులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి ,గంటల సమయం ఈ ఘటనను ఎవరు గమనించక పోవడంతో ఆవులు దాదాపు చావు అంచులవరకు వెల్లాయి ,అటు వైపుగా వెల్లిన రైతు ఈ సమాచారం గ్రామస్తులకు చేరవేయడంతో, గ్రామానికి చెందిన సురేష్, సుదీర్, చంద్రా అనే ముగ్గురు యువకులు తాల్ల సాయంతో బావిలోకి దూకి రెండు ఆవులను అతికష్టం మీద బయటకు తీసారు,అప్పటికే ఆవులు నీరు తాగడంతో అస్వస్థతకు గురయ్యాయి, సాహసంతో ఆవులను కాపాడిన యువకులను గ్రామస్తులు అభినందనలు తెలిపారు.