మదనపల్లె సమీపంలో ఆగస్టు 18వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు బి.ఈశ్వర్ నాయక్ (50) మృతి చెందారు. విధులకు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన సిమెంట్ లారీ ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.తండ్రి మృతితో కుమారుడు హర్షవర్ధన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలతో బయటపడేవారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ స్పందిస్తూ, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.