ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్సీ బీటీ నాయుడు హాజరయ్యారు. ఇటీవల ఆదోని మున్సిపల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం మొదటిసారి కౌన్సిల్ సమావేశానికి హాజరై కౌన్సిల్ సభ్యులను పరిచయం చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.