వినాయక చవితి వేడుకల్లో భాగంగా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం బస్ స్టాప్ వద్ద శ్రీ విజ్ఞేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 1500 కేజీల బెల్లంతో భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనకాపల్లి నుంచి బెల్లం కుందులను తెప్పించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బెల్లం కుందులతో ఏర్పాటు చేసిన గణనాధుని చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.