గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలను తరలించనట్లు సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఐదుగురు అక్కడే చిక్కుకుపోయారు. కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించినట్లు తెలిపారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించినట్లు వివరించారు.