విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తో కలిసి భోగాపురం ఎయిర్పోర్ట్ ని సందర్శించి, అక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించి అనంతరం సంబంధిత అధికారులు, ఇంజనీర్లుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించినారు. రివ్యూ అనంతరం కేంద్రమంత్రి తో కలిసి పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు 86% శాతం ప్రాజెక్టు పూర్తయిందని,వర్క్ ప్రెసెన్స్ అనుకున్న దాని కంటే పది శాతం అడ్వాన్స్ గా ఉన్నామని, జూన్ -2026 నాటికి ఎయిర్ లైన్స్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని, ఇప్పటికే కాలిబ్రేషన్ టెస్ట్ విజయవంతంగా పూర్తయిందని,