విజయనగరం రవాణా శాఖ అధికారులు వాహనదారులతో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రవాణా శాఖ అధికారి డి.మణికుమార్ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్, సరైన ధ్రువ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు మద్యం తాగి వాహనం నడపడం ద్వారా కుటుంబానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రస్తుతం చట్టాలు కఠినంగా ఉన్నాయి. అవగాహన పెంచుకోవాలన్నారు.