యువత బాధ్యతాయుతంగా మెలిగితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లాలోని వట్టి చెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కిట్స్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా బాగా పెరిగిందని, అంతే విధంగా సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింక్ లకు క్లిక్ చేసి అనేక మంది వారి బ్యాంకు ఖాతాలో ఉండే నగదును కోల్పోతున్నారని తెలిపారు.