జిల్లా యంత్రాంగం ప్రజా కేంద్రీకృతంగా (పీపుల్ సెంట్రిక్) గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారీయా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మధ్యాహ్నం జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో తన మనోగతాన్ని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం చక్కటి టీమ్ వర్క్ తో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. టీమ్ వర్క్ తో పనిచేసినపుడు సాధ్యం కానిది లేదని ఆమె అన్నారు. ప్రతి లక్ష్యంను సాధించాలని ఆమె చెప్పారు. ప్రజల కేంద్రీకృతంగా పాలన సాగుతుందని, అధికారులు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.