కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం మైలవరం జలాశయం నుండి శుక్రవారం జలాశయం స్పి ల్ వే గేట్ల నుండి 5000 క్యూసెక్కుల వరద నీరు పెన్నా నదిలోకి విడుదల చేయడం జరిగిందని జలాశయం అధికారులు తెలిపారు. కావున పెన్నానది తీర రైతులు, విద్యార్థులు, ప్రజలు, రజకులు, అధికారులందరూ అప్రమత్తతో ఉండవలెనని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్ తదితర విభాగ అధికారులు తగు చర్యలు తీసుకున్నవలసిందిగా కోరారు.విద్యార్థులు మరియు నది తీరంలో ఉంటున్న ప్రజలు అత్యంత అప్రమత్తతో ఉండాలని,నదిలో చేపట్టడం నిషేధించడం అయినదని మైలవరం డ్యామ్ కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రకటన ద్వారా తెలిపారు.