ఆదివారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు. వీపనగండ్ల మండల కేంద్రం నుండి సత్యం గ్రామానికి 3.90 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం వివిధ గ్రామాలలో పర్యటించి కుట్టు మిషన్ల పంపిణీ ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా కార్యక్రమం మరియు ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.