అత్త పై దాడి చేసిన కేసులో అల్లుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ పట్టణంలోని హడ్కో కాలనీ జులా సరిత పై అల్లుడు హైమత్ మద్యం మత్తులో అకారణంగా ఆమెను దూషించి. ఇటుకతో తలపై దాడి చేయగా సదరు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో అల్లుడు హైమత్ పై కేసు నమోదు చేసినట్లు సిఐ పేర్కొన్నారు.