సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోకి భారీ వాహనాలకు ప్రవేశం లేదని హుజూర్నగర్ ఎస్సై బండి మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం అనుమతి లేకుండా పట్టణంలోకి ప్రవేశించిన భారీ వాహనాలకు ఆయన చలానాలు విధించారు. రాత్రి 10 గంటల తరవాతే భారీ వాహనాలకు ప్రవేశం ఉంటుందని తెలిపారు .డ్రైవర్లకు పలు సూచనలు చేసిన ఆయన అనుమతి లేకుండా ప్రశ్నిస్తే చలానులు విధిస్తామని హెచ్చరించారు.