సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డులో లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర సోలాపూర్ నుండి విజయవాడకు ఉల్లిగడ్డలోడుతో వెళ్తున్న లారీ ఆదివారం సాయంత్రం వేగ నియంత్రణ కోల్పోయి బోల్తా కొట్టి పల్టీలు కొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్, క్లీనర్ లారీ క్యాబిన్లో ఇరుక్కోగా స్థానికులు వారిని లారీ లోంచి బయటకు తీసి జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.