నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో బుధవారం 11 గంటల సమయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు గ్రామంలోని యాదవ నగర్ 5వ వార్డు మరియు వివిధ వార్డులలో పర్యటించారు. వార్డులలో మురికినీరు రోడ్లపై చేరి దుర్గంధంగా మారిందని అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అన్నారు.అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు.అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రాన్ని సమర్పించారు.కార్యక్రమంలో మండల కార్యదర్శి అంజిలయ్య గౌడ్, కమిటీ సభ్యులు జోషి,కార్యదర్శి కనకప్ప మహేష్ తదితరులు పాల్గొన్నారు.