రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారకత కోసం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రోత్సహించడం జరుగుతుందని బ్యాంకుల ద్వారా ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో రుణాలు అందించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వీహబ్ ఆధ్వర్యంలో జిల్లా స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తలకు గ్యాంపు ఉమెన్ అక్కరలేషన్ ప్రోగ్రాం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.