కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో రైతులు యూరియా కోసం చెప్పులను, రాళ్లను క్యూ లైన్ లో పెట్టారు. ఉదయం నుండి ఇప్పటివరకు యూరియా పంపిణీ చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందించి రైతులకు యూరియాను ఇవ్వాలని కోరారు. యూరియా లేకపోవడంతో పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.