ఈనెల 26న గూడూరులో జరిగే బీ.సి.డబ్ల్యూ.యు జిల్లా సదస్సును జయప్రదం చేయాలని బీసీడబ్ల్యూయు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ పిలుపు నిచ్చారు. తిరుపతి జిల్లా సైదాపురంలోని ఐ.ఎఫ్.టి.యు జిల్లా కార్యాలయంలో సదస్సుకు సంబందించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యూ జిల్లా అధ్యకుడు డిపి పోలయ్య తదితరులు మాట్లాడుతూ... రాష్ట్రాభివ్రుద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 35 లక్షల కుటుంబాల వారు సుమారుగా 40 రకాల వ్రుత్తుల్లో పనిచేస్తున్నారన్నారు