పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన స్పీకర్ అయ్యన పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. వేదయపాలెం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పోలీస్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా పోలీసు అసోసియేషన్ స్పందించకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. పోలీస్ శాఖ పై తమకు గౌరవం ఉంది కాబట్టే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపారు.