వ్యవసాయంలో రైతులకు డ్రోన్ సాంకేతికత సహాయంతో పంటల సాగు బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చంనాయుడు అన్నారు . శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మడ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు డ్రోన్ సహాయంతో నిర్వహించిన నానో యూరియా, నానో డీఏపీ మందులతో వరి పంట పొలంలో పిచికారి ప్రక్రియను ఆయన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 20 డ్రోన్లు మంజూరు కా గా 18 రైతు సంఘాల గ్రూపులకు పంపిణీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.