దళితులు రాజ్యాధికారం వైపు వెళ్లకుండా రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆర్ ఏ సి సి ఎస్ మరియు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ రత్నాకర్ తెలిపారు. విభజించు పాలించు పేరుతో జరుగుతున్న చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా ఎంసిఏ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం పేరుతో పాలకులు వర్గీకరిస్తున్నారని, రిజర్వేషన్ శాతం పెంచి అందరికీ ఫలాలు అందేలా చూడటం లేదన్నారు. భూములు, సంపద, క్యాబినెట్ లో ఎందుకు రిజర్వేషన్ అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.