భీమవరం డిప్యూటీ మేయర్కు సత్కారం కౌన్సిలర్ నుంచి డిప్యూటీ మేయర్గా ఉన్నతస్థాయికి చేరుకోవడం ఒక చారిత్రాత్మక విజయమని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు లండన్ డిప్యూటీ మేయర్ ఉదయ్ ను అభినందించారు. లండన్లో ఈ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన మొదటి భారతీయ సంతతి వ్యక్తిగా ఉదయ్ నిలిచారని, భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలో మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు.