Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: పట్టణంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించాలి: డీవైఎఫ్ఐ నాయకులు

Alur, Kurnool | Aug 26, 2025
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆలూరు లోని ప్రభుత్వ హాస్పిటల్ ముందు నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించాలని మంగళవారం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి డివైఎఫ్ఐ ప్రాంతీయ అధ్యక్షులు గోవర్ధన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ ఆలూరు ప్రాంతీయ కన్వీనర్ మైన మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గం కేంద్రంలో రోగుల సౌకర్యార్థం కొరకు సుమారు రూ. కోటి వెచ్చించి సామాజిక ఆరోగ్య కేంద్రం నాడు-నేడు కింద భవనం నిర్మించారు. భవన నిర్మాణం పూర్తయి 3 సంవత్సరాలు అయిన ప్రారంభించలేదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us