కామారెడ్డి మండలం చిన్న మాల్రెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు డిప్టేషన్ పై హైదరాబాదులో పని చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలన్నారు. పాఠశాలలో పిఈటి క్రీడా ఉపాధ్యాయుడు లేకపోవడం వల్ల విద్యార్థులు క్రీడలు లేక చాలా నష్టపోతున్నట్లు తెలిపారు.