నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 41.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా దస్తురాబాద్ మండలంలో 7.2, కడెం పెద్దూర్ లో 6.2, లక్ష్మణచందా 5.4, పెంబి లో 4.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందన్నారు. రాబోయే 24 గంటలలో జిల్లాలో భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు