పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను ఫీజు రియంబర్స్మెంట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ బుధవారం బీవీఎం భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులతో కామారెడ్డి పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్భంగా బీబీఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. స్కాలర్షిప్ రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో విద్యార్థులు తరఫున ఆందోళనలు చేస్తామన్నారు.