డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు… పోటీ పరీక్షలు, ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి" అని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు స్పష్టం చేశారు.ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం కూడా మధ్యవర్తుల ద్వారా రాదని హెచ్చరించారు.నిరుద్యోగ యువత దళారుల మాయమాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.ఇటీవల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసపోయిన బాధితులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తమకు న్యాయం చేయాలని తరచూ కోరుతున్నారని తెలిపారు.ఎంఆర్ఓ ఆఫీసులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, పాఠశాలలు, కోర్టులు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, ప్రైవేట్ కంపెనీలు – ఇలా పలు ఉద్యో