వికారాబాద్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్ ఫరీద్ సాహబ్ ఎన్నికయ్యారు. ఆదివారం వికారాబాద్‌లో అసోసియేషన్ సభ్యుల ఎన్నిక జరిగింది. ఉపాధ్యక్షుడుగా మల్లప్ప, ప్రధాన కార్యదర్శి వెంకటలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాయి కుమార్‌లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి పలువురు అభినందనలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.