కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు హన్స రాజు మీనా వద్ద నుండి రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు మొబైల్ ఫోన్ ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతనికి సహకరించిన మరో వ్యక్తి అభిషేక్ పరారిలో ఉన్నట్లు తెలిపారు. అతని కోసం ప్రత్యేక టీములు ఏర్పాటు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.