శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఆదివారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. లైసెన్స్ లేకుండా హెల్మెట్ ధరించినవారికి ఎస్సై రమేశ్ బాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 11 వాహనాలకు రూ.15వేలు జరిమానా విధించినట్లు SI రమేశ్ బాబు తెలిపారు. కార్యక్రమంలో కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.