తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కూటమి నేతల మధ్య వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది. సోమవారం స్థానిక శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగమల్లేశ్వర స్వామి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన పట్టణ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఫోటో ఎక్కడ వేయకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో తెలుగుదేశం పార్టీకి కీలకంగా పని చేసే ఆకుతోట రమేష్ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడం ఇక్కడ వర్గ పోరు తారస్థాయికి చేరిందని సూళ్లూరుపేట ప్రజ