తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం నుంచి పారిశుద్ధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలో 5 రోజులపాటు శ్రీ పోలేరమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. జాతర ముగిసిన వెంటనే మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులను మొదలుపెట్టారు. వీధులన్నీ శుభ్రం చేస్తూ చెత్తను మున్సిపల్ వాహనాల ద్వారా తరలిస్తున్నారు.