కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం తెలిపారు. గణేష్ శోభాయాత్ర మరియు నిమజ్జనం కోసం దాదాపు 867 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, NCC క్యాడెట్‌లు మరియు వాలంటీర్లను విధుల్లో నియమించినట్లు ఆయన చెప్పారు. ఈ బందోబస్తులో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 40 మంది ఎస్‌ఐలు, 350 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, 100 మంది హోంగార్డులు, 150 మంది NCC క్యాడెట్‌లు మరియు 200 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు.