కాంగ్రెస్ నాయకులు రూపొందించిన ఫ్లెక్సీలు కరీంనగర్ లో గురువారం మధ్యాహ్నం 2గంటలకు వివాదానికి తెరలేపాయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాన్ని ఫ్లెక్సీల్లో చేర్చలేదంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఇందుకు కారకుడైన రాజేందర్ రావు చిత్రపటాన్ని దిష్టిబొమ్మ దహనం చేయబోగా పోలీసులు అడ్డుకుని పలువురు దళితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరికొందరు దళిత సంఘ నాయకులు వెలిచాల రాజేందర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం గమనార్హం.