షాద్నగర్ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం హర్షనీయమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే సమాజంలో శాంతి సామరస్యం విరజిల్లుతుందని శంకర్ అన్నారు.