గంట్యాడమండలం గొడియాడ గ్రామ శివారులో పేకాట స్థావరం పై నిర్వహించిన మెరుపు దాడి లో పేకాడుతూ పట్టుబడిన 5 గురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని శుక్రవారం రాత్రి గంట్యాడ ఎస్సై సాయి కృష్ణ విలేకరులకు తెలిపారు. పట్టుబడిన వ్యక్తుల నుంచి 49,250 నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకుని సీజ్ చేశామన్నారు. పేకాడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ సాయికృష్ణ తెలిపారు.