మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలో ఒకసారిగా మంటలు తెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కంపెనీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.