గుత్తి పట్టణంలోని రెడ్డి స్ట్రీట్ లో యువకులు చూడముచ్చటగా ప్రకృతి వినాయకుని ఏర్పాటు చేశారు. అచ్చం అడవిలో చెట్టు చేమలు, గడ్డి, ఆకులు, జంతువులు, విష పురుగులు వంటి వాటితో మండపాన్ని ఏర్పాటు చేశారు. అడివిలో జలపాతం మాదిరి నీళ్లు ధారావాహికంగా మారుతున్న దృశ్యాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సై సురేష్, ఏఎస్ఐ రామాంజనేయులు, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షులు భాస్కర్, పోలీసులు మంగళవారం రాత్రి వీక్షించారు. ప్రకృతి వినాయకుని ఏర్పాటు చేసిన యువకులను ఎస్సై ప్రత్యేకంగా అభినందించారు.