కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీల నెరవేర్చాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. రేషన్ డీలర్లకు గౌరవవేతనం తోపాటు క్వింటాకు రూ.300 ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరి తెలంగాణలో కూడా దిగుమతి హమాలిని ప్రభుత్వమే భరించాలని పేర్కొన్నారు.