ట్యాంక్ బండ్ వద్ద ఖైరతాబాద్ గణనాథుడుని శనివారం మధ్యాహ్నం గంగమ్మ వాడికి చేర్చారు. జయ జయ ద్వానాల నడుమ క్రేన్ సహాయంతో ఘనపయ్యను గంగమ్మ వాడికి చేర్చారు. ఈ ఏడాది మహాగణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహా గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ట్యాంక్ బండ్ పరసర ప్రాంతాలు గణపయ్య నామస్మరణతో దద్దరిల్లుతున్నాయి.