బ్రిడ్జి పై నుండి పొంగిపొర్లుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం నిన్న కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ సమీపంలో వికారాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న పరిగి బ్రిడ్జిపై వర్షపు నీరు ఉధృతిగా ప్రవహిస్తుండడంతో పరిగి వికారాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిగి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాహనదారులు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.