సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు. పట్టణంలోని మస్తాన్ కాలనీలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంతో సోమవారం మధ్యాహ్నం ఎస్సై వినయ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 15,800/- రూపాయల నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పేకాట, జూదం ఆడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.