Parvathipuram, Parvathipuram Manyam | Aug 29, 2025
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి శుక్రవారం జిల్లాలోని దోనుబాయి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ సిబ్బందిచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం స్టేషన్లోని ఎస్ హెచ్ ఓ రైటర్ కంప్యూటర్ సిబ్బంది రాదలను కేసు ప్రాపర్టీ భద్రపరిచిన గదులను సీట్ చేసిన వాహనాలను స్టేషన్ యొక్క పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. గంజాయి, నాటుసారా రవాణా అరికట్టేందుకు తరచూ వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.