అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎఫ్ఆర్ఎస్ యాప్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గురువారం స్థానిక భీమడోలు జంక్షన్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేసి కార్యాలయ వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా సంఘ నాయకులు స్వర్ణకుమారి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లింగరాజు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాట్యుటీ జీవోను సవరించాలని కోరారు.