కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటయ్య నగర్ లో బుధవారం పట్ట పగలే చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇంట్లో ఎవరూ లేనిది గమనించి తాళం పగలగొట్టి దుండగులు చోరీ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో సుమారు 12 తులాల బంగారం ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు తెలుపుతున్నారు. విషయం తెల్సిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.